Sankranti Holidays: విద్యార్థులకు బిగ్‌ షాక్‌.. సంక్రాంతి సెలవులు రద్దు, కారణం ఇదే..

Sankranti Holidays In AP: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే స్కూలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఈ సెలవులు ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తారు. ఏకంగా వారంపాటు ఈ సెలవులు ఉంటాయి. అయితే, ఈ సారి సంక్రాంతి సెలవులు రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
 

1 /5

సంక్రాంతి ప్రతి ఏడాదిక ఒకసారి వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగ చాలా వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయానికి పిల్లా, పెద్దా ఎక్కడ ఉన్నా సొంత గ్రామానికి చేరుకుంటారు.  

2 /5

ఈ పండుగ ముఖ్యంగా మూడు రోజులపాటు నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ. అయితే, సంక్రాంతి పండుగకు సొంత ఊరు లేదా అమ్మమ్మలు ఊళ్లకు పిల్లలు పెద్దలు కూడా వెళ్తారు.  

3 /5

సంక్రాంతి పండుగ ప్రత్యేకం పిండి వంటలు, కొత్తబట్టలు కొనుగోలు చేయడం. దీంతోపాటు పందెం కోళ్లు, ఎడ్ల పోటీలు ఇలా ఉత్సవంగా ఈ పండుగ జరుపుకుంటారు. అందుకే దేశంలో ఎక్కడ ఉన్న ఈ పండుగ సమయానికి సొంతూరుకు వెళ్లాలనుకుంటారు.  

4 /5

కానీ, ఈ ఏడాది విద్యార్థులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. అది కూడా కేవలం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎందుకంటే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో ఈ పండుగ సెలవులను కుదించేలా సర్కారు నిర్ణయించింది.  

5 /5

మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే విద్యాశాఖ తయారు చేసింది. దీన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులు పదో తరగతి చదివేవారికి నిర్వహించనున్నారు. దీంతో వారికి కేవలం సంక్రాంతి సెలవులు మూడు రోజులు వస్తాయని అంటున్నారు.