'అమ్మ ఒడి' పథకం కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న పేద తల్లిదండ్రులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 26న నుంచి ఈ పథకం ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 


ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్  మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా 'అమ్మ ఒడి' పథకంతో లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. అర్హులైన తల్లులకు ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వివరించారు. ఈ వ్యవధిలోపు లోపు ఈ పథకానికి సంబంధించిన విధి విధానలు రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్  పేర్కొన్నారు