COVID19 ఆసుపత్రి నుంచి పేషెంట్ అదృశ్యం
Old Man Missing From Covid Hospital: అసలే వృద్ధుడు.. అనారోగ్యంతో ఉండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి లక్షణాలున్నాయని అక్కడి వైద్యులు చెప్పడంతో.. జూన్ 24న కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు నుంచి ఆ వృద్ధుడి జాడ కరువైంది.. సిబ్బంది తన భర్త ఆచూకీ గురించి చెప్పకపోవడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ వృద్ధురాలు పోలీస్‌స్టేషన్ మెట్లక్కింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడలో చోటుచేసుకుంది.
Old Man Missing at Covid Hospital: అసలే వృద్ధుడు.. అనారోగ్యంతో ఉండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి లక్షణాలున్నాయని అక్కడి వైద్యులు చెప్పడంతో.. జూన్ 24న కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు నుంచి ఆ వృద్ధుడి జాడ కరువైంది.. సిబ్బంది తన భర్త ఆచూకీ గురించి చెప్పకపోవడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ వృద్ధురాలు పోలీస్‌స్టేషన్ మెట్లక్కింది. ఈ నిర్లక్ష్య సంఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడలో చోటుచేసుకుంది. Also read: AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే
చికిత్స కోసం గతనెల 24న విజయవాడ ( Vijayawada ) లోని కోవిడ్19 ఆసుపత్రికి వెళ్లిన 63ఏళ్ల వసంతరావు అనే వృద్ధుడి అదృశ్యం సంఘటన కలకలం సృష్టించింది. వసంతరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు మొదట ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా (coronavirus) లక్షణాలు ఉన్నాయని అక్కడి వైద్యులు చెప్పడంతో కోవిడ్ హాస్పటల్ (Covid19 Hospital)కి తరలించారు. ఆరోజు సాయంత్రం వరకు ఆయన భార్య ధనలక్ష్మీ ఆసుపత్రి దగ్గరే ఉంది. ఆ తర్వాత ఆధార్ కార్డు కావాలని సిబ్బంది అడగడంతో రాత్రికి ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు ఉదయం తిరిగి ఆసుపత్రికి వెళ్లగా.. తన భర్త అక్కడ లేడనీ.. సిబ్బంది, వైద్యులను అడిగితే తెలియదని, పారిపోయి ఉంటాడేమో అంటూ ఏవేవో సమాధానాలు చెబుతున్నారని బాధితురాలు ధనలక్ష్మీ ఆరోపించింది. వీల్‌చైర్‌లో తీసుకెళ్లిన వ్యక్తి ఎలా పారిపోతాడని, ఎలాగైనా తన భర్తను వెతికిపెట్టాలని ఆమె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. Also read: Plasma bank: ప్లాస్మా బ్యాంకు ఎలా ఉంటుంది ? ఎవరు అర్హులు ?
సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వసంతరావును వీల్ చైర్‌లో ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు రికార్డుల్లో లేదు. ఈ మేరకు పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. వారం దాటినా తన భర్త ఆచూకీ లభించలేదని ఎలాగైనా తన భర్త ఆచూకీని కనిపెట్టాలని ధనలక్ష్మీ అధికారులను వేడుకుంటోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..