AP Budget 2024-25: ఎన్నికల యేడాది కాబట్టి.. ఆంధ్ర ప్రదేశ్ లో అప్పడు అధికారంలో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ అకైంట్ ప్రవేశపెట్టింది. అయితే.. 2024లో ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయి గద్దె దిగింది. కొత్తగా కొలువు దీరిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ఇంకా బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా మీనా మేషాలు లెక్కపెట్టిందంటూ ప్రతిపక్ష పర్టీ ఆరోపణలు గుప్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో పది రోజుల్లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే..ముఖ్యమంత్రి,  ఉద్యోగులు సహా ఎవరి జీతాలు ఇవ్వడానికి ఉండదు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల 11న ఉభయ సభల్లో  ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమర్పిస్తారు. ఆర్ధిక మంత్రి పయ్యావులకు ఇదే ఫస్ట్ బడ్జెట్ అని చెప్పాలి. ‌ అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్‌పై దిశానిర్దేశం చేశారు.


కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే నాలుగు నెలలకు పైగా సమయం పట్టిందన్నారు. అంతేకాదు అప్పులు, ఆదాయాలు వివరాలు పూర్తి స్థాయిలో నివేదిక కోసం ఎక్కువ సమయం పట్టింది.  అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై గతంలో శ్వేతపత్రమూ వెలువరించింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.