AP&TS Forecast: మండుతున్న ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజులు వర్షాలు పలకరించనున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా తేలికపాటి వర్షాల పడవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూమికి ఎగువన ఉన్న ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దక్షిణ, నైరుతి దిశల్నించి తెలంగాణ, ఏపీల మీదుగా వీస్తుండటంతో వాతావరణలో మార్పులు రానున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ఇక 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు. రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఇవాళ, రేపు వాతావరణం పొడిగానే ఉంటుంది. రాయలసీమలో 1-2 చోట్ల వర్షాలు పడవచ్చు. కొన్ని చోట్లు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండ కూడా 1-2 ప్రాంతాల్లో వర్షసూచన ఉంది.


ఇక తెలంగాణలో కూడా ట్రోపో గాలుల ప్రభావంతో వర్షాలు పడనున్నాయి.రానున్న 3 రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ..ఈదురుగాలులు గట్టిగా వీయనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ఈదురుగాలులతో పాటు వర్షాలు కూడా పడనుండటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడవచ్చు.


Also read: KTR Comments‌: కేటీఆర్ సంచలన కామెంట్స్‌..ఎంఐఎంతోనే మాకు పోటీ.. బీజేపీకి సింగిల్ డిజిటే.!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.