Today Weather: గత కొన్నిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఊరట కలిగింది. చిన్నపాటి, వడగండ్లతో కూడిన వర్షాలు ఉపశమనం ఇచ్చాయి. రానున్న 3 రోజులు తేలికపాటి వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చి మ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. మరో ద్రోణి దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్బ పరిసర ప్రాంతాల్లో  ఉన్న ఉపరితల ఆవర్తనం వరకూ కొనసాగనుంది. ఫలితంగా ఇవాళ, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. మరి కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయనున్నాయి. ఇవాళ తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి డిల్లాల్లో వడగండ్లు పడే అవకాశముంది. ఇక హైదరాబాద్ నగరంలో మేఘావృతమై ఉండి తేలికపాటి చినుకులు పడవచ్చు. 


ఇక ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకూ ఉండవచ్చు. ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంద్ర మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఫలితంగా ఉత్తర కోస్తాంద్రలో తేలికపాటి వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. 


Also read: CM YS Jagan: గాల్లోకి లేచిన చీపురు.. సీఎం హెలికాప్టర్ కు తప్పిన పెను ప్రమాదం.. అధికారులు సీరియస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook