Kumari Aunty: కుమారి ఆంటీకి బిగ్ షాక్.. బిజినెస్ క్లోజ్..!

Kumari Aunty Stall Closed : కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిండు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత సంవత్సరం.. “మీది 1000 ..2 లివర్స్ ఎక్స్ట్రా..,” అనే మీమ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు కుమారి అంటే బిజినెస్ షట్ డౌన్ చేశారు అన్న వార్త వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 /5

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు కుమారి ఆంటీ.. " మొత్తం 1000 రుపీస్ అయ్యింది. విత్ రెండు లివర్ లో ఎక్స్ట్రా" అంటూ చెప్పే డైలాగుతో కుమారి ఆంటీ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 

2 /5

ఈమె చెప్పే డైలాగ్స్ తో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈమె వ్యాపారం చేసే చోట కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందట. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రజలు..వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈమె వ్యాపారాన్ని మూసివేయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

3 /5

అంతేకాకుండా కుమారి ఆంటీ వ్యాపారానికి  లైసెన్సు కూడా లేదని.. ఈమె వ్యాపారానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పలు రకాల మీమ్స్, రీల్స్  కూడా చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు సాధారణ ఫుడ్ స్టాల్.. ఓనర్ గా పేరు పొందిన ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గతంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో ఈమె స్టాల్ ను తొలగించడం జరిగింది. 

4 /5

అయితే ప్రజలలో ఉన్న డిమాండ్ మేరకు ఈమె తిరిగి మళ్లీ స్టాల్ ని ప్రారంభించింది. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈమె విషయంలో జోక్యం చేసుకొని మళ్లీ ప్రారంభించేలా చూసుకున్నారు. కేవలం మౌత్ పబ్లిసిటీ వల్ల దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి కూడా కుమారి ఆంటీ  భోజనాన్ని తింటున్నారు.  ఇలా మొదట ఐదు కేజీల బియ్యంతో ప్రారంభించి,  ప్రస్తుతం 100 కేజీల బియ్యం వరకు వ్యాపారం చేస్తుందట. సుమారుగా ఈమె ప్రతినెల 18 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.   

5 /5

కుమారి ఆంటీ చేసే మాంసాహార వంటకాలకు కూడా భారీగానే డిమాండ్ ఉండడంతో చాలామంది గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారట . దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఈమె షాపును క్లోజ్ చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.