AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు, నవంబర్ 11 న బడ్జెట్
AP Assembly Session 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 11 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇప్పటి వరకూ ఓట్ ఆన్ ఎక్కౌంట్‌తోనే ప్రభుత్వం నెట్టుకొచ్చింది. ఇప్పుడిక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఈ నెల 11 నుంచి పది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే అంటే నవంబర్ 11నే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌తో పాటు కొన్ని కీలకమైన బిల్లులు కూడా సభలో తీసుకురానున్నారు.
అసెంబ్లీ సమావేశాల కంటే ముందే నవంబర్ 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
Also read: AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.