AP Cabinet Extension: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనేది స్పష్టమైంది. మరి ఎవరెవరికి మంత్రివర్గంలో కొత్తగా అవకాశం లభిస్తుంది, ఎవరికి రాదనే విషయంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మంత్రివర్గంలో కొత్త ముఖాలు రానున్నాయి. కొందరు పాతమంత్రులకు ఉద్వాసన పలికి..కొత్త బాథ్యతలు అప్పగించనున్నారు. మంత్రివర్గంలో మార్పులుంటాయని..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టత ఇవ్వడంతో అందరిలో ఆసక్తి  ప్రారంభమైంది. కొందరికి మంత్రి పదవి బాధ్యతలు తప్పించి..పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇంకొందరికి మంత్రివర్గంలో కొనసాగించనున్నారు. మంత్రివర్గంలో మార్పులైతే కచ్చితంగా ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎవరెవర్ని తిరిగి కొనసాగిస్తారు, ఎవరికి అవకాశాలు లభిస్తాయనే విషయంలో చర్చ రేగుతోంది. ఎవరికి వారు సమీకరణాలు, లెక్కలు వేసుకుంటున్నారు. కులాలు, జిల్లాలు, ప్రాంతాల ప్రాతిపదికన లెక్కలేసుకుంటూ మంత్రి పదవి వస్తుందా రాదా అనేది అంచనా వేసుకుంటున్నారు.


ఆ ఐదుగురికీ మరోసారి ఛాన్స్, కన్నబాబుకు ప్రమోషన్


ఈ క్రమంలో 5-6 మంత్రులను తిరిగి కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, కొడాలి నానిలను కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ కొనసాగించే అవకాశాలున్నాయి. కన్నబాబు, కొడాలి నానిలకు ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కూడా వెళ్లాయని సమాచారం. కన్నబాబుకు ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


తూర్పులో ఇంకా ఎవరికి


రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పు గోదావరి. 19 నియోజకవర్గాలున్న జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులున్నారు. ఎస్సీ కోటా నుంచి పినిపే విశ్వరూప్ కాగా మరో ఇద్దరు కన్నబాబు, వేణుగోపాలకృష్ణలున్నారు. వేణుగోపాలకృష్ణ, విశ్వరూప్‌లకు ఉద్వాసన ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో తుని నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాడిశెట్టి రాజా, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు మంత్రి పదవి వస్తుందనే అభిప్రాయాలున్నాయి. అయితే సామాజిక వర్గాల సమీకరణ నేపధ్యంలో ఈ ఇద్దరికీ అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే ఇదే సామాజికవర్గం నుంచి ఇప్పటికే కన్నబాబుకు పెద్దపీట వేసిన నేపధ్యంలో ఈ జిల్లా నుంచి కాపు సామాజికవర్గం నుంచి మరో వ్యక్తికి అవకాశం లేనట్టే. రాజానగరం నియోజకవర్గం కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలో వస్తున్నందున..కొత్త జిల్లాల సమీకరణాలు పరిగణలో తీసుకుంటే జక్కంపూడి రాజాకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని కొందరి అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం మంత్రివర్గ విస్తరణలో కొత్త జిల్లాల సమీకరణాలు తీసుకోవడం లేదు. కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశ్యంతో మంత్రి కన్నబాబుకు మరోసారి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చని సమాచారం.


Also read: AP SSC Exams Postponed: ఏపీలో వాయిదా పడనున్న పదవ తరగతి పరీక్షలు, రేపు కొత్త షెడ్యూల్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook