AP Cabinet Decisions: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పూర్తయింది. పలు కీలకమైన నిర్ణయాలకు కేబినెట్ అనుమతిచ్చింది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న 2,733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ త్వరలో అమలు కానుంది. దీనిపై  అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. రేపు కర్ణాటక రవాణా మంత్రితో సమావేశం కానున్నారు. మరోవైపు 2,733 కోట్లతో రాజధాని ప్రాంతం అమరావతిలో చేపట్టనున్న పనులగు ఆమోదం లభించింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, పలు భవనాలు, లే అవుట్ అనుమతులకు కేబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా మున్సిపల్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిలో బెడ్స్ సంఖ్యను 100కు పెంచేందుకు అనుమతి లభించింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. 


రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. చిత్తూరులో ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుక స్థలం కేటాయించనున్నారు. ఇక నంద్యాల, వైఎస్ఆర్ , కర్నూలు జిల్లాల్లో వాయు, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. 


Also read: Land Charges: ఏపీలో మరో బాదుడు కార్యక్రమం, భారీగా పెరగనున్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.