Land Charges: ఏపీలోని కూటమి ప్రభుత్వం క్రమంగా వివిధ రకాల ఛార్జీలు పెంచుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనుంది. ఒకేసారి 15-20 శాతం ఛార్జీలు పెరగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఏపీలో ల్యాండ్ కొనుగోలు చేయనున్నారా..అయితే త్వరగా అంటే ఈ నెలలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తే మంచిది. ఎందుకంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయన్నారు. 15-20 శాతం ఛార్జీలు పెరగనున్నాయి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్ని ప్రాంతాల్లో పెరగవని కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుందని మంత్రి వివరించారు.
వాస్తవానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం జనవరి 1 అంటే ఇవాళ్టి నుంచే పెంచాలని నిర్ణయించినా విమర్శలు లేదా వినతుల ఆధారంగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును అనివార్యం చేసింది. ఛార్జీల పెంపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. వివిధ ప్రాంతాల్లో భూములకు ఉన్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగా ఎక్కడెక్కడ ఛార్జీలు పెంచాలనేది నిర్ణయమౌతుంది. సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో భూమి విలువకు, మార్కెట్ విలువకు అంతరం చాలా ఉంటుంది. దాంతో భూమి కొనుగోళ్లు జరిగినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేయనుంది.
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయని తెలియడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
Also read: Bank Holidays: 13 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.