CM Jagan Serious: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్నారు సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంస్ట్రక్షన్స్ కంపెనీ ఉద్యోగుల బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన సీఎం సమీప బంధువు కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు వెళ్లాయి. జిల్లాలో ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అందులో సీఎం స్పష్టం చేశారు.


సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోసారి ప్రజా ప్రభుత్వమని నిరూపించారని అక్కడివాసులు అంటున్నారు. కొండారెడ్డి అవినీతిపై సమగ్ర దర్యాప్తునకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్‌(CM JAGAN) నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో విచారణలో స్పీడ్ పెంచారు. కొండారెడ్డి బాధితులు ఒక్కొక్కరికిగా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


 


Also read:SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట'... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..


Also read:Teenmar Mallanna Interview: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? మల్లన్న మనసులో ఏముంది ? బిగ్ డిబేట్ విత్ భరత్ లైవ్ షో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook