Andhra Pradesh: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Chittoor Ex MLA Satyaprabha passas away: అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే కరోనా బారిన పడిన సత్యప్రభ అక్టోబరు 10న బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఆరోగ్యం సహకరించకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షిణించడంతో కన్నుమూసినట్లు పేర్కొన్నారు.
అయితే.. చిత్తూరు టీడీపీ సీనీయర్ నాయకుడు, టీటీడీ (TTD) మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన చనిపోయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్య ప్రభ చనిపోయారని తెలియడంతో చిత్తూరు జిల్లా టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా
సత్యప్రభ మరణం పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంతాపం తెలయజేశారు. సత్యప్రభ మరణం తెలుగుదేశం పార్టీకి, చిత్తూరు జిల్లాకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతిచేకూర్చాలని చంద్రబాబు ట్విట్ చేశారు. ఈ సందర్బంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. Also read: Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి