CM Jagan Mohan Reddy starts Tungabhadra pushkaralu: కర్నూలు: పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (CM Jagan Mohan Reddy) శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్‌ బాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు. అనంతరం హోమంలో పాల్గొన్నారు. అయితే తుంగభద్ర పుష్కరాలు (Tungabhadra pushkaralu) ఈ రోజు నుంచి డిసెంబరు 1 వరకు జరగనున్నాయి. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ మేరకు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో 23 పుష్కరఘాట్లను ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు నుంచి సంకల్‌ బాగ్‌ ఘాట్‌లో నిత్య హోమాలు చేపట్టనున్నారు. అన్నిచోట్ల పోలీసులను మోహరించడంతోపాటు.. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. Also read: Anil Vij: కోవ్యాక్సిన్ డోసు తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి


Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి