CM Jagan: నాడు-నేడు కింద స్కూళ్లలో చేస్తున్న పనులపై నిరంతరం ఆడిట్ చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి నెలకు ఒకసారి ఆడిట్ చేయాలన్నారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయని పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యా శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆడిట్ చేసిన వివరాలను ఈసందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తెలియ జేసేందుకు 14417 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు.  విద్యా కానుకపై సీఎం జగన్ ఆరా తీశారు. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్ని రకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. 


స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యా కానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్ క్లీనిక్ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. 


సీఎం ఇచ్చిన ఆదేశాలతో స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. ప్రతి వారం స్కూళ్లను ఉన్నతాధికారులు సందర్శించేలా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు సీఎం జగన్. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫోటోగ్రాఫ్‌లతో సహా అప్‌లోడ్ చేయాలని తేల్చి చెప్పారు.  టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్నారు.


ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్‌ ఉండనుంది. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు దాదాపు 72 వేల 481 యూనిట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. డిజిటలైజేషన్‌ కోసం దాదాపు రూ.512 కోట్లకు పైగా ఖర్చు కానుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్‌ జరిగేలా చూడాలని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. 


అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లీనిక్స్‌ల్లో ఇంటర్నెంట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్‌ సురేష్‌కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Also read:Vijayashanti: కేసీఆర్‌కు ప్రధాని పదవి రావడం పగటి కలే..విజయ శాంతి హాట్ కామెంట్స్..!


Also read:Weather Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..మరోమారు భారీ వర్ష సూచన..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి