Vijayashanti: బీజేపీతోనే తెలంగాణలో మార్పు సాధ్యమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదని..గార్బేజ్ హైదరాబాద్‌లా ఉందని విమర్శించారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చెత్తమయం అయ్యిందన్నారు. కేసీఆర్ వచ్చాక భాగ్యనగరం సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ సంధుల్లో ఎక్కడ చూసినా..కచరానే దర్శనమిస్తోందన్నారు. విష జ్వరాలను అరికట్టడంలో విఫలమయ్యారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నారన్నారు విజయ శాంతి. రోడ్లు, డ్రైనేజీలు, నాలాల పరిస్థితి అద్వాన్నంగా ఉందని తెలిపారు. కేసీఆర్ పాలన అతి నీచంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి ఇంత వరకు బకాయిలు చెల్లించలేదన్నారు. మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను కేసీఆర్ అమలు చేయడం లేదని చెప్పారు. తెలంగాణ రైతులను పట్టించుకోని కేసీఆర్..పక్క రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ సొమ్ము పంచుతున్నారని విమర్శించారు.
ఇలాంటి నీచుడితో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానన్నారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టించేలా చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి. ప్రజల కాలి గోటికి సీఎం కేసీఆర్ సరిపోడన్నారు. కేసీఆర్, నితిష్ కుమార్ లాంటి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా..మోదీని ఏమి చేయలేరని స్పష్టం చేశారు. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనని విమర్శించారు. ప్రధాని అంటేనే బాగ్ మిల్కా బాగ్ లా పారిపోతున్నారని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు విజయశాంతి.
ఇవాళ మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధి నుంచి 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. పండుగల నేపథ్యంలో పాదయాత్రను 10 రోజులకు కుదించారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ముగింపు సభలో ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
ఇప్పటివరకు 40 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర సాగింది. 4వ విడతతో కలిసి 48 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉండనుంది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు వెల్లడించారు. స్థానికంగా నీటి, విద్యుత్ సమస్యలు, ఆర్టీసీ, పెట్రోల్‌పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలపైనా పాదయాత్రలో చర్చ జరగనుంది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామంటున్నారు.
Also read:సైమా అవార్డ్స్ 2022లో మెరిసిన పూజా హెగ్డే.. 'మేడమ్ సర్ మేడమ్ అంతే'..!
Also read:Weather Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..మరోమారు భారీ వర్ష సూచన..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి