వైఎస్సార్ మత్స్యకార భరోసాకి వైఎస్ జగన్ శ్రీకారం.. వారి ఖాతాలోకి రూ.10వేలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం. బుధవారం (మే 6న) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బుధవారం (మే 6న) తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనుంది. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మద్యం మత్తులో పామును కరకర నమిలేశాడు!
ఏపీలోని మత్స్యకారులకు ఇది నిజంగానే శుభవార్త. నేడు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేస్తారు. ఎన్నికలకు ముందు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలసిందే. ఏపీలో మరో 60 మందికి కరోనా
వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10లక్షలకు పెంచామని మంత్రి మోపిదేవి తెలిపారు. ఏపీలో మూడు నెలల చేపల వేట నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయారు. వీరిని ఆదుకునేందుక చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా (#YSRMatsyakaraBharosa) పథకాన్ని ప్రవేశపెట్టి రూ.10వేలు ఇచ్చి ఆదుకుందన్నారు. దాదాపు లక్షకు పైగా మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అందాల ‘కంచె’ కడుతోన్న ప్రగ్యా జైస్వాల్
ఇటీవల గుజరాత్‌లో చిక్కుకున్న వేలాది ఏపీ మత్స్యకారులను ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారి కోసం రూ.3కోట్ల నిధులు విడుదల చేశారు. ఏ ఇబ్బంది లేకుండా వారిని స్వస్థలానికి తీసుకొచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!