ఏపీలో మరో 60 మందికి కరోనా.. 1777కి చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 60 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ మేరకు ఏపీ వైద్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Last Updated : May 6, 2020, 12:54 PM IST
ఏపీలో మరో 60 మందికి కరోనా.. 1777కి చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1777కు చేరుకుంది. చికిత్స అనంతరం కరోనా నుంచి 729 మంది కోలుకున్నారు. ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకూ 26 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 1012కు పెరిగాయి. మత్స్యకారులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ.10వేలు

Image Credit: twitter/@ArogyaAndhra
  ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు
మొత్తం 7,782 శాంపిల్స్ పరీక్షించగా 60 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఆ జిల్లాలో ఏకంగా 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 533, గుంటూరు 363, కృష్ణా 300 కేసులతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News