Andhra Pradesh: CM YS Jagan Mohan Reddy to visit Kanaka Durga temple in Vijayawada: శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు (Kanakadurgamma) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇక తాజాగా దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అమ్మవారిని దర్శించుకుని, సీఎం జగన్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి (indrakeeladri) జగన్‌ చేరుకోనున్నారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : CM YS Jagan in Tirumala : శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


ఆగ్మెంటెడ్‌ రియాల్టీ షో


అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్‌ రియాల్టీ షోను (Augmented reality show) ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy)ప్రారంభించనున్నారు. దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీతో ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వరస్వామి దేవస్థానాల వద్ద దుర్గమ్మ (Durgamma) చరిత్ర చెప్పే క్యూఆర్‌ కోడ్‌ ఉన్న బోర్డులు ఏర్పాటు చేశారు. కనకదుర్గ ఏఆర్‌ అనే యాప్‌ ద్వారా కోడ్‌ స్కాన్‌ చేస్తే అమ్మవారి చరిత్ర మొత్తం ఆడియా, వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.


Also Read : Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook