Zee Telugu Sankranthi Special: విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతి సంబరాలు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!

Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మరోపక్క జీ తెలుగు అందించే.. ఎంటర్టైన్మెంట్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మరి అలాంటి జీ తెలుగు ప్రోగ్రాంలో.. మనకెంతో ఇష్టమైన విక్టరీ వెంకటేష్ వస్తే.. ఆ సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి అదే జరగబోతోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 26, 2024, 08:14 PM IST
Zee Telugu Sankranthi Special: విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతి సంబరాలు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!

Zee Telugu Sankranthi Special Program: నిరంతరం వినోద కార్యక్రమాలు అందించడంలో జీతెలుగు ఎప్పుడు ముందుంటుంది. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోతోంది. ముఖ్యంగా..రెండు రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బుల్లితెర అభిమానులను పలకరిస్తోంది జీ తెలుగు. 

ఈ సంవత్సరం మొత్తం ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లతో అలరించిన జీ తెలుగు.. 2025 సంవత్సరాని కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. తెలుగువారి పెద్ద పండగైన సంక్రాంతిని..మరింత సంబరంగా జరుపుకునేందుకు మన కాకినాడకు జీ తెలుగు వచ్చేస్తోంది. హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్యఅతిథులుగా సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలకు వస్తున్నాం’ అంటూ కాకినాడలో సంక్రాంతి సంబరాలు చేయనుంది జీ తెలుగు. ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ మూవీ టీమ్ సందడి చేయనున్న జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ డిసెంబర్ 28 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. కాకినాడలో జరగనుంది. 

కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల(P.R Government college) గ్రౌండ్ వేదికగా జీ తెలుగు సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బుల్లితెర అభిమానుల సందడితో కోలాహలంగా జరగనున్న ఈ కార్యక్రమానికి.. యాంకర్ రవి వ్యాఖ్యాత గా వ్యవహరించనుండగా జీ తెలుగు సీరియల్స్ నటీనటులు సందడి చేయనున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీమ్ కూడా పాల్గొని అభిమానులను అలరించనుంది. హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితోపాటు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఆమని, శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బుల్లితెరపై నటనతో అలరిస్తున్న జీ తెలుగు తారలు తమ అభిమానులతో కలిసి సంక్రాంతి జరుపుకునేందుకు మన కాకినాడ వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మీ అభిమాన తారలను నేరుగా పలకరించే అవకాశం పొందండి.

Also Read: TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!

Also Read: TFI Meets Revanth Reddy: సినీ ప్రముఖుల ప్రతిపాదనలు.. సీఎం ఏమన్నారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News