ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి
కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 98 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.
APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. లాక్‌డౌన్ సడలింపులు, ప్రజల అజాగ్రత్త కారణంగా కరోనా మహమ్మారి ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 98 మందికి కోవిడ్19 (COVID-19) పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో 29 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఏపీలో తాజాగా ముగ్గురు వ్యక్తులను కరోనా మహమ్మారి బలిగొంది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 71కి చేరుకుంది. సూపర్ ఐడియా.. క్యాబ్‌లో నిశ్చింతగా ప్రయాణం
గడిచిన 24 గంటల్లో ఏపీలో 9,986 శాంపిల్స్ పరీక్షించగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలపి రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,377కి చేరింది. ఇందులో చికిత్స అనంతరం 2,273 మంది డిశ్ఛార్జ్ కాగా, ప్రస్తుతం 1,033 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నమోదైన కొత్త కేసులలో 19 మంది తమిళనాడులోని కోయంబేడు నుంచి నెల్లూరుకు వచ్చిన వారు ఉన్నారు. మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
రాష్ట్రంలో తాజాగా ముగ్గురు మరణించగా.. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కో మరణం నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి నలుగురు కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 616 మందికి కరోనా పాజిటివ్ తేలగా, ప్రస్తుతం 372 యాక్టీవ్ కేసులున్నాయి. తాజాగా 33 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్