AP CoronaVirus Cases | ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 706 మందికి కరోనా సోకగా, మిగతా 87 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు(AP COVID19 Cases) 13,891కు చేరుకున్నాయి.  విషాదం: పెళ్లి తంతు ముగిసేలోగా వధువు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల(CoronaVirus Cases In AP)కు గాను 6232 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 7,429 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 11 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 180కి చేరింది. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్


ఏపీలో గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 793 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 302 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయం జిల్లాలో ఒక్కరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనా కారణంగా చనిపోయారు. ‘ఊపిరి ఆడటం లేదు.. బై డాడీ’ కరోనా పేషెంట్ చివరి వీడియో


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,72,076 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 11,554 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,946 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 391 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ