హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్

పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali Tested Positive for CoronaVirus) కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

Updated: Jun 29, 2020, 01:14 PM IST
హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్
Image Credit: Twitter

Mahmood Ali Tested COVID19 Positive | హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలంగాణలోని ప్రజాప్రతినిధులు, నాయకులను, సెలబ్రిటీలను వణికిస్తోంది. ఇంతకుముందు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ (Mahmood Ali) కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆయనకు అస్తమా ఉండటంతో ముందుగానే కుటుంబసభ్యులు ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజుల క్రితం ఆయనకు పరీక్షలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు.  వణికిస్తోన్న కరోనా.. భాగ్యనగరంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా!

హోంమంత్రికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హోంమంత్రి వెంట తిరిగిన వారందరినీ, ఆయన ప్రాథమికంగా కలిసిన వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. దీంతోపాటు హోంమంత్రి నివాస పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజింగ్  చేస్తున్నారు. ఇటీవలనే ఆయన సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటీవ్‌గా తేలడంతో అప్పటినుంచి హోంమంత్రి మహమూద్ అలీ హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ‘ఊపిరి ఆడటం లేదు.. బై డాడీ’ కరోనా పేషెంట్ చివరి వీడియో
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ