AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్రమణ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గడం విశేషం. మరోవైపు కరోనా కట్టడికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండా్ వేవ్(Corona Second Wave)ఉధృతి దాదాపుగా తగ్గింది. గత కొద్దిరోజుల్నించి కరోనా సంక్రమణ భారీగా తగ్గినా..3-4 రోజుల్నించి మాత్రం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. నిన్న ఏపీలో 1623 కొత్త కేసులు నమోదు కాగా ఇవాళ ఆ సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కేవలం 739 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.


గత 24 గంటల్లో ఏపీలో 43 వేల 594 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షల 20 వేల 64కు చేరుకోగా..19 లక్షల 93 వేల 589 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 14 మంది మరణించగా..ఇప్పటి వరకూ 13 వేల 925 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఏపీలో 1333 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరులో అత్యధికంగా 166, నెల్లూరులో 114, తూర్పు గోదావరి జిల్లాలో 58, కడప జిల్లాలో 98, ప్రకాశం జిల్లాలో 94 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా సంక్రమణ మరోసారి విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వం(Ap government) కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తోంది. 


Also read: AP Corona Update: ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook