AP Deputy CM Amzath Basha donated plasma: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Amzath Basha ) కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు. బాషాతోపాటు ఆయన సతీమణి, కుమార్తె కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే అంజాద్ బాషా కరోనా నుంచి కోలుకున్న తర్వాత గురువారం ప్లాస్మా దానం చేశారు. కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో గురువారం ఆయన ప్లాస్మా కేంద్రాన్ని ప్రారంభించి.. ఈ కేంద్రంలో మొదటిసారిగా బాషా ప్లాస్మాను దానం చేశారు. Also read: #Watch: ప్రసవ వేదన.. అరణ్య రోదన


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) ఆదేశాలతో అన్నీ కోవిడ్ సెంటర్లల్లో ప్లాస్మా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు.  Also read: COVID19: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కేకి కరోనా పాజిటివ్