YCP Election Manifesto: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోపైనే పడింది. ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిలిపివేశారు. ఈ నెల 26వ తేదీన మేనిఫెస్టో విడుదల చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ 25వ తేదీన పులివెందులలో నామినేష,న్ దాఖలు చేయనున్నారు. మరోవైపు 26వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేశారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గేమ్ ఛేంజర్ కానుందనే అంచనాలున్నాయి. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో విశాఖపట్నంలో సమావేశం అవుతున్నారు. బస్సు యాత్రలో ప్రజల్నించి వచ్చిన సూచనలు, సలహాలతో మేనిఫెస్టోకు తుదిరూపు ఇవ్వనున్నారు. 


మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పధకాల కొనసాగింపుతో పాటు అదనంగా కొన్ని అంశాలుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి పరిధి పెంచడం, వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంపు ఉండనుంది. అన్నింటికంటే ప్రధానంగా రైతు రుణమాఫీ ప్రకటించాలంటూ నేతల్నించి ఒత్తిడి పెరుగుతోంది. 2019లో ఇచ్చిన హామీల్ని నూటికి నూరుశాతం అమలు చేశామని చెబుతున్న జగన్ ప్రతి సభలోనూ చేసేదే చెబుతామంటున్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన డ్వాక్రా సంఘాల రుణమాఫీని అమలు చేశారు. ఇప్పుడీసారి రైతు రుణమాఫీ ఉంటుందనే అంచనాలున్నాయి. 


రైతు రుణమాఫీ ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు కచ్చితంగా గేమ్ ఛేంజర్ కావచ్చని తెలుస్తోంది. రుణమాఫీతో పాటు మరికొన్ని ఊహించని అంశాలుండవచ్చని అంచనా వేస్తున్నారు. 


Also read: AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook