Jan Mat Survey 2024: బీజేపీతో పొత్తు.. ఏపీలో ఓటరు నాడి మారిందా, తాజా సర్వే ఏం చెబుతోంది
Jan Mat Survey 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండ్రోజుల్లో విడుదల కానుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరిదనే విషయంపై తాజాగా మరో ప్రముఖ సంస్థ సర్వే చేపట్టింది.
Jan Mat Survey 2024: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీయేలో చేరింది. ఆరేళ్ల తరువాత ఎన్డీయేలో టీడీపీ రీ ఎంట్రీతో పదేళ్ల క్రితం పొత్తులు రిపీట్ అయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ఎన్డీయేలో తెలుగుదేశం మళ్లీ చేరడంతో ఏపీ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమీకరణాలు మారుతున్నాయి. వన్ ప్లస్ వన్ టూ అవుతుందా లేదా అనేది మరోసారి ఆసక్తి కల్గిస్తోంది. అందుకే ప్రముఖ జాతీయ సర్వే సంస్థ జన్‌మత్ తాజాగా ఒపీనియన్ పోల్ నిర్వహించింది. బీజేపీ చేరిక తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై అధ్యయనం చేసింది.
ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడినప్పటికీ మరోసారి ఫ్యాన్ గాలి వీయడం ఖాయమని తేల్చింది. మొత్తంత 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 119-122 స్థానాలు సాధిస్తుందని అంచనా వేసింది. ఇదే సంస్థ బీజేపీ చేరక ముందు వైసీపీకు 114-117 సీట్లు వస్తాయని తెలిపింది. ఇప్పుడు బీజేపీ చేరిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తుందని అంచనా వేస్తోంది. అటు లోక్‌సభ విషయంలో కూడా 19-20 స్థానాలు చేజిక్కించుకుంటుందని తెలిపింది.
అదే సమయంలో తెలుగుదేశం-బీజేపీ-టీడీపీ కూటమికి 49-51 స్థానాలు లభిస్తాయని జన్‌మత్ సంస్థ అభిప్రాయపడింది. లోక్‌సభలో 5-6 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా పరిశీలిస్తే బీజేపీకు 326-328 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకు 43-45, టీఎంసీకు 21-23, ఆమ్ ఆద్మీ పార్టీకు 7 స్థానాలు రావచ్చని వెల్లడించింది.
Also read: Shabbir Ali: ముస్లింలకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదు. భయపడవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook