AP Elections 2024: ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు, జాబితా ఇదే
AP Elections 2024: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేడెక్కిపోయింది. జనసేన-తెలుగుదేశం పొత్తు నేపధ్యంలో జనసేన ఎక్కడెక్కడ్నించి పోటీ చేస్తుందనే విషయంపై ఏర్పడిన సందిగ్దత తాదాపుగా తొలగింది. జనసేన పోటీ చేసే స్థానాలు పైనల్ అయినట్టు సమాచారం.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల వ్యవధిలో వెలువడవచ్చు. ఈ క్రమంలో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకుని 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న జనసేన పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనేది క్లారిటీ లేకపోవడంతో ఇన్నాళ్లూ కేడర్‌లో అయోమయం నెలకొంది. ఇప్పటికే 24 అసెంబ్లీ స్థానాల్లో 5 స్థానాలను ప్రకటించగా మరో 19 స్థానాలు ఎక్కడనే విషయంలో ఇప్పుడు దాదాపుగా స్పష్టత వచ్చింది.
తెలుగుదేశంతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన తొలి జాబితాలో తెనాలి, కాకినాడ రూరల్, రాజానగరం, అనకాపల్లి, నెల్లిమర్ల అభ్యర్ధుల పేర్లున్నాయి. అటు తెలుగుదేశం 94 మందిని ప్రకటించింది. ఈ 94 మందిలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ తదితరులున్నారు. ఇప్పుడిక రెండో జాబితాపై రెండు పార్టీలు దృష్టి సారించాయి. ఇదే కూటమిలో మూడో పార్టీగా బీజేపీ చేరనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క సీటును కేటాయించారు.
విశాఖపట్నంలో జనసేనకు కేటాయించిన పెందుర్తికి బదులు మాడుగుల స్థానం ఇచ్చేందుకు నిర్ణయించారు. కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం కాకుండా పి గన్నవరం కేటాయించారు. తిరుపతి మాత్రం జనసేన ఖాతాలో వెళ్లింది.
శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ ( ఎస్సీ), విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, విశాఖపట్నం జిల్లాలో విశాఖ దక్షిణం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, రాజోలు (ఎస్సీ), పి గన్నవరం( ఎస్సీ), రాజానగరం, అమలాపురం, పిఠాపురం ఉన్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం( ఎస్టీ) నియోజకవర్గాలున్నాయి. కృష్ణా జిల్లాలో విజయనగరం పశ్చిమం, అవనిగడ్డ ఉన్నాయి. ఇక గుంటూరులో తెనాలి, ప్రకాశం జిల్లాలో దర్శి, చిత్తూరు జిల్లాలో తిరుపతి, అనంతపురం జిల్లాలో అనంతపురం, కడప జిల్లాలో రైల్వేకోడూరు నియోజకవర్గాలున్నాయి.
Also read: APPSC Notifications 2024: నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ, అర్హత, దరఖాస్తు వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook