APPSC Notifications 2024: నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ, అర్హత, దరఖాస్తు వివరాలు ఇలా

AP Govt Jobs 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ శాఖల్లో కీలక ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2024, 11:59 AM IST
APPSC Notifications 2024: నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ, అర్హత, దరఖాస్తు వివరాలు ఇలా

APPSC Govt Jobs Notifications 2024: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ జరగనుంది. ఇందులో అత్యధికంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులున్నాయి. రిక్రూట్‌మెంట్ వివరాలు, కావల్సిన అర్హత, వయస్సు, పరీక్ష ఎలా ఉంటుంది, సిలబస్ వివరాలన్నీ నోటిఫికేన్లలో ఉన్నాయి. 

ఏపీ అటవీ శాఖలో మొత్తం 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకు ఏప్రిల్ 15 నుంచి మే 5 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జోన్ వారీగా ఖాళీల్ని ప్రకటించారు. జోన్ 1 లో 8, జోన్ 2లో 11, జోన్ 3లో 10, జోన్ 4లో 8 ఖాళీలున్నాయి. వీటిలో ఓసీ కేటగరీ అభ్యర్ధులకు 14  కేటాయించగా మిగిలినవి వివిధ రిజర్వేషన్ వర్గాలకు కేటాయించారు. ఇందులో బిసి ఎ  3, బిసి బి  3, బిసి సి 1, బిసి డి 4, బిసి ఇ 2 కాగా ఎస్సీ అభ్యర్ధులకు 7, ఎస్టీలకు 1, ఈడబ్ల్యూఎస్ కేటగరీకు 3 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్. మేథ్స్ ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్సెస్ అంశాల్లో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. 

రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  పరీక్షా కేంద్రాలుంటాయి. దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా పరీక్ష ఫీజు 120 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైట్ రేషన్ కార్డు కలిగిన అభ్యర్దులు 120 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 

ఇక స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 5 ఖాళీలున్నాయి. వీటికి ఏప్రిల్ 18 నుంచి మే 8 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 4 ఉన్నాయి. దరఖాస్తులు ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు స్వీకరిస్తారు. ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్షన్ పోస్టులు 3 ఉన్నాయి. వీటికి అప్లికేషన్లను మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరిస్తారు. ఇటీవలి కాలంలో ఎపీపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. 

Also read: Chandrababu Delhi Tour: బీజేపీతో పొత్తుపై ఇవాళ క్లారిటీ వస్తుందా, ఢిల్లీకు చంద్రబాబు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News