AP Elections 2024: ఎన్నికల్లో పోల్‌మేనేజ్‌మెంట్ లేకుంటే ఎంత చేసినా, ఏం చేసినా నిష్ప్రయోజనం. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితి అలా ఉంది. క్షేత్రస్థాయిలో పని సరిగ్గా లేకపోతే ఎన్ని పథకాలిచ్చినా ఏం చేసినా ఫలితం ఉండకపోవచ్చు. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే వైనాట్ 175 లక్ష్యంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపిక చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. కావల్సినవారిని సైతం పక్కనపెట్టేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. పార్టీ పరిశీలకులతో పాటు ప్రతి వార్డుకు ఓ కన్వీనర్ నియమించారు. ఓ వైపు అభ్యర్ధుల ఎంపిక, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలుతో సరిపెట్టకుండా పోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాలంటీర్లతో పాటు రథ సారధుల్ని నియమించారు. తరువాత వార్డు కన్వీనర్లను నియమించారు. ఇప్పుుడు కొత్తగా ప్రతి పోలింగ్ బూత్‌కు 15మందితో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. 


స్థానిక ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 15 మందితో కమిటీ నియమించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47 వేల పోలింగ్ కేంద్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 5 వేలమంది అదనంగా పోల్ మేనేజ్‌మెంట్‌లో దిగనున్నారు. ఈ కమిటీల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు సామాజికవర్గాలవారీగా మహిళలకు సైతం అవకాశం కల్పిస్తూ నియమిస్తారు. వార్డు వాలంటీర్ సహకారంతో ప్రతి ఇంటితో ఈ కమిటీలోని 15 మంది మమేకం కావల్సి ఉంటుంది. ఈసారి కొత్త అభ్యర్ధులు ఎక్కువమంది బరిలో ఉండటంతో పోల్‌ మేనేజ్‌మెంట్ ఎక్కడా మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


పోలింగ్ రోజు ఈ 15 మంది బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకం కానుంది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నియోజకవర్గంలోని పరిస్థితుల్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో సీనియర్లతో వార్ రూమ్ ఏర్పాటవుతోంది. ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమైనందున ముఖ్యమంత్రి జగన్ ఈ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. 


Also read: Madhya Pradesh Politics: మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook