AP Elections 2024: ఏపీలో 2014 ఎన్నికల పొత్తులు రిపీట్ కానున్నాయి. పదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరింది. మూడు పార్టీలు కలిసి ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. అసెంబ్లీ స్థానాలు ఎన్ననే విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానున్న ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ చేరడంతో ఆ ప్రభావం ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటుపై పడింది. తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరిన తరువాత అసెంబ్లీ సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాకున్నా..పార్లమెంట్ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే..బీజేపీ 6 లోక్ సభ స్థానాల్లో, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. అంటే జనసేన ఓ లోక్‌సభ స్థానాన్ని కోల్పోతుంది. 


జనసేన-బీజేపీకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయనే వార్తల నేపద్యంలో బీజేపీ ఆరు అసెంబ్లీ సీట్లకు ఒప్పుకుంటుందా లేక జనసేన నుంచి 2-3 సీట్లు తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక బీజేపీ పోటీ చేయనున్న పార్లమెంట్ స్థానాల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు సమాచారం. 


రాజమండ్రి, అనకాపల్లి, అరకు, ఏలూరు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుందని తెలుస్తోంది. జనసేన మాత్రం కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలకు పోటీ చేయనుంది. రాజమండ్రి లోక్‌సభ నుంచి పురంధరేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి.


Also read: Bjp New Strategy: ఏపీలో బీజేపీ భారీ వ్యూహమే పన్నిందా, బీజేపీ పగ్గాలు పవన్ చేతికి ఇవ్వనుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook