Janasena-Tdp List: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ కూడా వచ్చి చేరనుంది. ఈలోగా జనసేన-తెలుగుదేశం ఒక్కసారిగా 99 మందితో కూడిన ఉమ్మడి జాబితాను విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగుతున్న తెలుగుదేశం-జససేన సీట్ల సర్దుబాటులో ప్రకటన లేకుండానే ఒక్కసారిగా ఉమ్మడి జాబితా విడుదలైంది. ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్దుల ప్రకటన పేరుతో జాబితా విడుదలైంది. ఇందులో ఉమ్మడి గుర్తును కూడా డిజైన్ చేశారు. తొలి జాబితాలో ఏకంగా 118 స్థానాలకు అభ్యర్దుల్ని ప్రకటించారు. ఇందులో 94 తెలుగుదేశం అభ్యర్ధులు కాగా, జనసేన 24 మంది అభ్యర్ధుల్ని ప్రకటించింది. మొత్తం 99 మంది జాబితాలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా జాగ్రత్తలు తీసకున్నారు. 


జనసేకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్ని తెలుగుదేశం కేటాయించింది. మిగిలిన స్థానాల్లో బీజేపీకు కొన్ని మినహాయిస్తే మిగిలినవి టీడీపీ పోటీ చేయనుంది. తెలుగుదేశం 94 స్థానాలకు జాబితా విడుదల చేసింది. ఇక జనసేన కేవలం 5 స్థానాల్నే తొలి జాబితాలో ప్రకటించింది. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ పేర్లు ప్రకటించారు. 


టీడీపీ నుంచి కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడే పోటీ చేయనున్నారు. తుని నుంచి యనమల దివ్య, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు, కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఏలూరు బడేరి రాధాకృష్ణ, విజయవాడ సెంట్రల్ బొండా ఉమ, విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు, మంగళగిరి నారా లోకేష్, సత్తెనపల్లి, కన్నా లక్ష్మీ నారాయణ ఉన్నారు. 


Also read: Janasena strategy: జనసేన టికెట్ కావాలా, అయితే డబ్బులు సిద్ధం చేసుకోవల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook