Former cm ysjagan flight journey with bharathi: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. సీఎంగా చంద్రబాబు ఒకవైపుఏపీకి పూర్వవైభవం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన నష్టాన్ని కూడా శ్వేత పత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. అధికారులుతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తు.. ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు పోతున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్.. తమకు అసెంబ్లీలో అపోసిషన్ హోదా ఇవ్వాలంటూ కూడా పలు మార్లు కూటమిని కోరడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కు, కోర్టుల వరకు కూడా వెళ్లారు. దీనిపైన పెద్ద రచ్చే జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మాజీ సీఎం తనకు సెక్యురిటీ విషయంలో కూడా కోర్టులకు వెళ్లారు. తనకు ప్రాణ హనీ ఉందని, గతంలో తనపై కత్తితో, రాయితో దాడులకు ప్రయత్నించారని మాజీ సీఎం జగన్ కోర్టు వారికి తన ఆవేదనను తీసుకెళ్లారు. అంతేకాకుండా.. జూన్ 3కు ముందు ఉన్న భద్రతను తనకు కొనసాగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం తనకు కేవలం జెడ్ ప్లస్ కెటగీరి భద్రత కల్పిస్తుందని, దీనిలో 58 మంది భద్రత సిబ్బందిని ఇస్తున్నారని అన్నారు. గతంలో తనపై జరిగిన హాత్యా ప్రయత్నాల మూలంగా తనకు మరింత భద్రతను పెంచాలని కూడా జగన్ కోర్టువారిని కోరారు.


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణితో కలిసి సాధారణ ప్రయాణికుల్లా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైఎస్ జగన్ దంపతులు ఇలా సింపుల్‌గా అందరితో కలిసి ప్రయాణించడంపై చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లి, బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. విజయవాడ నుంచి ఎక్కువగా బెంగళూరుకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఇలా అందరితో కలిసి సామాన్యుడిలా విమానంలో రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Read more: Viral Video: బాప్ రే.. మంచం కింది నుంచి షాకింగ్ శబ్దాలు.. పరుపు తీసి చూడగా.. షాకింగ్ వీడియో వైరల్..


ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు.. అయితే ఇటీవల నంద్యాల జిల్లా పర్యటనకు మాత్రం ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు సీఎం హోదాలో.. ఆయన ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేవారు.. ఈ నేపథ్యంలో అధికారం కోల్పోగానే సామాన్యుడిలా ఆయన ప్రయాణించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు మాజీ సీఎం విమానంలో కన్పించడంతో చాలా మందిఫోటోలు తీసుకుంటున్నారు. ఆయనతో  సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter