ఏపీకి కేంద్రం ఆర్థిక సహాయం, మహారాష్ట్రకు అత్యధిక నిధులు !
ఏపీకి కేంద్రం ఆర్థిక సహాయం, మహారాష్ట్రకు అత్యధిక నిధులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కేంద్ర ఆర్థిక సహాయం కింద నిధులు మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాధామోహన్ సింగ్ పాల్గొన్న ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. 2018-19 మధ్య కాలంలో అకాల వర్షాలు, వరదలు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆరు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి మొత్తం రూ. 7214.03 కోట్ల నిధుల విడుదలకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా ఏపీకి రూ 900.40 కోట్లు, కర్ణాటకకు రూ. 949.49 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 317.44 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ. 191.73 కోట్లు, గుజరాత్‌కు రూ. 127.60 కోట్లు, పుదుచ్చేరికి రూ. 13.09 కోట్లు కేటాయించగా మహారాష్ట్రకు అత్యధికంగా రూ. 4,714.28 కోట్ల నిధులు ఆమోదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.