AP Ration Cards:ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం..  రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును తక్కువ ధరకు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ. 180 రూపాయలు ఉండగా.. రైతు బజార్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో 110కే అందిస్తున్నారు. అయితే నవంబర్ నెల నుంచి  బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదారను పంపిణీ చేయనున్నారు. రెండు నెలల కిత్రం దీని కోసం టెండర్లు పిలవగా.. గత నెల నుంచి గోడౌన్‌లకు సరుకు చేరుతోంది. నవంబరులలో రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు, పంచదార బియ్యంతో పాటు  ఇవ్వబోతున్నారు.
 
ఆంధ్ర ప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం సత్తాలోకి వచ్చాక కాంట్రాక్టర్లను కొత్తగా ఎంపిక చేసింది. సరుకులకు సంబంధించి కచ్చితమైన తూకం ఉండేలా చూస్తున్నారు. అంతేకాదు నాణ్యమైన సరకు సరఫరా చేయనున్నారు. వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ 67 రూపాయలు చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు చేపట్టారు అధికారులు. అలాగే పంచదారను కూడా రేషన్‌‌తో పాటుగా పంపిణీ చేస్తారు. చక్కెరను ఏఏవై కార్డుదారులకు కేజీ రూ. 14కు..మిగిలిన వారికీ అరకేజీ రూ. 17 రూపాయలకు   విక్రయించనున్నారు. ఇకపై ప్రతీ నెలా కందిపప్పు నూరు శాతం కార్డుదారులకు అందిస్తామంటున్నారు అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించింది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. ప్రభుత్వం రాయితీపై కిలో కందిపప్పును రూ.67కే అందించాలని నిర్ణయం తీసుకుంది. బయట మార్కెట్‌లో కిలో పంచదార రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనబోతుంది. నిత్యావసరాల ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. మొన్న దసరా, ఈ నెలాఖరులో దీపావళి పండుగలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది, మరోవైపు కందిపప్పు, చక్కెర మాత్రమే కాదు.. గోధుమపిండి, రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించే పనిలో ఉంది. జనవరి నుంచి ఈ సరకుల్ని కూడా రేషన్‌తో పాటుగా పంపిణీ చేయాలని భావిస్తోంది.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter