AP SSC, AP Inter Exams 2021 cancelled: అమరావతి: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం వరకు పరీక్షలు నిర్వహించే తీరుతామనే వైఖరితో ఉన్న ఏపీ ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాప్తి మధ్య పరీక్షలు నిర్వహణకు ఎదురయ్యే సవాళ్లను ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలతో తమ నిర్ణయం మార్చుకోకతప్పలేదు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఏపీలో టెన్త్ క్లాస్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Why AP 10th class, Inter exams cancelled- పరీక్షల రద్దుకు కారణం:
ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేకుండా ఏపీలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించే తీరుతామని ముందు నుంచీ ప్రకటిస్తూ వచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా తమ నిర్ణయం మార్చుకోవడం వెనుక చాలా పరిణామాలే జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు కారణంగా ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని సుప్రీం కోర్టు మందలించడం, అలాగే జూలై 31లోపే ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించాలనే షరతులు విధించడం వంటివి ఏపీ సర్కారుని పునరాలోచనలో పడేలా చేశాయి. 


Also read : Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం


పరీక్షలు రద్దు ప్రకటన సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education minister Adimulapu Suresh) మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూలై 31 లోపే పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం అసాధ్యం'' అని అన్నారు. పరీక్షల నిర్వహణకు, జవాబు పత్రాల మూల్యాంకనంకే 45 రోజులు సమయం పడుతుందని.. అందువల్లే పరీక్షలు రద్దు (AP Board Exams cancelled) చేయడానికే మొగ్గు చూపినట్టు మంత్రి సురేష్ తెలిపారు. 


AP SSC results, AP Inter results 2021: ఫలితాల వెల్లడి విధివిధానాల ఖరారుకు హైపవర్ కమిటి:
'' పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికే చివరి వరకు ప్రయత్నించాం. కానీ అనుకోని పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది కాబట్టి ఫలితాలు ఏ ప్రాతిపదికన వెల్లడించాలి అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫలితాల వెల్లడి విధివిధానాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని నియమిస్తాం. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగానే విధి విధానాలు రూపొందించి ఫలితాలు (AP SSC results 2021, AP Inter results 2021) వెల్లడిస్తాం '' అని  మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.


Also read : TS Inter results guidelines: ఇంటర్ ఫలితాల వెల్లడికి మార్గదర్శకాలు


Also read : Telangana high court: Schools reopening పై తెలంగాణ సర్కారుకు హై కోర్టు ప్రశ్నలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook