AP Night Curfew: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. అప్పటి వరకు అమలులో కొవిడ్ ఆంక్షలు!
AP Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది.
AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది జగన్ సర్కారు. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జీవో మంగళవారం విడుదల చేసింది.
జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత 18వ తేదీ నుంచి అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ జనవరి 31 వరకు అమలులో ఉంటుందని గతంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 14 వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అలాగే ఏపీలో కరోనా ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి.
కరోనా ఆంక్షలు
ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అలాగే షాపింగ్ మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే 10 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు.. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్‌లలో అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా 50 శాతం కెపాసిటీతో థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్ తప్పనిసరి చేయాలని ఏపీ సర్కార్ పేర్కొంది.
Also Read: AP PRC Issue: రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో మరోసారి చర్చలు
ALso Read: Ap corona cases: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..కొత్త కేసులు ఎన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook