అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో టెన్త్ క్లాస్ పరీక్షలను ప్రస్తుతం రెండు వారాలపాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు రీషెడ్యూల్ తేదీలను మార్చి 31న ప్రకటిస్తామని చెప్పారు. కాగా, తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 31నుంచి ఏప్రిల్ 17వరకు ఏపీ టెన్త్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది.  ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెలవుల్లోనూ పూర్తి జీతం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది వరకే పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. దీంతో విద్యాశాఖ బోర్డ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేసింది. దీంతో ఈ పరీక్షలు రెండోసారి వాయిదా వేసినట్లయింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలిసారి ఏపీ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా పడటం తెలిసిందే.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


మనసున్న మారాజు.. ప్రకాష్ రాజ్


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ