AP Sankranti Holidays 2024 For Colleges: ఏపీలో ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 18న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని.. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇప్పటికే స్కూల్స్‌కు ప్రకటించిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు 10 రోజులు సెలవులు ఇచ్చింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని విద్యాలయాలకు హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 18వ తేదీ వరకూ రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు పదిరోజుల పాటు సెలవులను ప్రకటించింది. వీటిలో జనవరి 13 రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం భోగి, జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగలున్నాయి. 


ఇక తెలంగాణలో కూడా ఇప్పటికే సంక్రాంతి సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ కాలేజీలకు జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ వరకు అంటే.. నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల 17న కాలేజీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఇక సంకాంత్రి పండగ నేపథ్యంలో నగరాల్లో ఉంటున్న వాళ్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే రైళ్లు, బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook