MPDO`s Promotions: ఏపీ ఎంపీడీవోలకు గుడ్ న్యూస్... ఒకేసారి 236 మందికి ప్రమోషన్లు...
AP MPDO`s gets Promotions: ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఎంపీడీవోల కల నెరవేరింది. ఎట్టకేలకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP MPDO's gets Promotions: సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఎంపీడీవోల కల నెరవేరింది. ఒకేసారి 236 మంది ఎంపీడీవోలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇందులో 12 మందిని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోలుగా, 51 మందిని డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్‌గా, మరో 173 మందిని డీఎల్‌డీవో హోదాతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 660 ఎంపీడీవో అధికారులు ఉండగా... వారిలో ఒకేసారి 236 మందికి ప్రమోషన్లు దక్కడం విశేషం. రాష్ట్రంలో 1996 నుంచి ఎంపీడీవోల పదోన్నతుల అంశం పెండింగ్‌లో ఉంది. 1986లో తొలిసారి మండలాల వ్యవస్థ ఏర్పాటవగా... అప్పట్లో ఎంపీడీవో పోస్టులకు సర్వీస్ రూల్స్ లేవు. 1999లో తొలిసారి ఎంపీడీవోలను ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయగా... 2001లో ఆ పోస్టులకు సర్వీస్ రూల్స్ రూపొందించారు.
ఈ నేపథ్యంలో సర్వీస్ రూల్స్‌కు ముందే పదోన్నతులపై ఎంపీడీవోలుగా నియమితులైనవారికి, నేరుగా రిక్రూట్ అయినవారికి మధ్య సీనియారిటీ విషయంలో సమస్య తలెత్తింది. దీంతో ఎంపీడీవోలుగా కొనసాగుతున్నవారికి 25 ఏళ్లుగా పదోన్నతులు లేకుండా పోయాయి. దీనిపై దృష్టి సారించిన జగన్ సర్కార్... ఎంపీడీవోల పదోన్నతుల కోసం ప్రత్యేకంగా 200 పోస్టులను గుర్తించింది. వీటిల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక్కో డీఎల్‌డీవో చొప్పున 51 డీఎల్‌డీవో పోస్టుల్లో, గ్రామీణాభివృద్ధి శాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్‌పై ఎంపీడోవోలకు మాత్రమే పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎంపీడీవోల కల నెరవేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook