KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమాపై నెటిజన్ల టాక్... 'టెర్రిఫిక్ మెంటల్ మాస్'...

KGF Chapter 2 Twitter Review: రాకీ భాయ్ రానే వచ్చేశాడు... కేజీఎఫ్ 2 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 10 వేల స్క్రీన్లలో విడుదలైంది. కేజీఎఫ్ 1 చేసిన మ్యాజిక్‌ను కేజీఎఫ్ 2 రిపీట్ చేసిందా లేదా... సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారు...   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 08:03 AM IST
  • థియేటర్లలో మొదలైన కేజీఎఫ్ 2 దండయాత్ర
  • భారీగా థియేటర్లకు క్యూ కడుతున్న ఫ్యాన్స్
  • కేజీఎఫ్2పై ట్విట్టర్‌లో నెటిజన్లు ఏమంటున్నారంటే..
 KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమాపై నెటిజన్ల టాక్... 'టెర్రిఫిక్ మెంటల్ మాస్'...

KGF Chapter 2 Twitter Review: రాకీ భాయ్ రానే వచ్చేశాడు... కేజీఎఫ్ 2 తో థియేటర్లపై దండయాత్ర మొదలుపెట్టాడు... ప్రపంచవ్యాప్తంగా నేడు (ఏప్రిల్ 14) 10 వేల స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమాకు కేవలం బుక్ మై షో, పేటీఎం ద్వారానే 40 లక్షల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోమాలు నిక్కబొడిచే హీరో ఎలివేషన్ షాట్స్, ప్రేక్షకుడిని సీట్లో నుంచి కదలనివ్వని కథ కథనాలతో కేజీఎఫ్ 1 చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఒక సాదా సీదా సినిమాగా థియేటర్లలో విడుదలైన కేజీఎఫ్ 1.. పెద్ద ప్రభంజనమే సృష్టించింది. అయితే కేజీఎఫ్ 2 ఆ మ్యాజిక్‌‌ను రిపీట్ చేసిందా... సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సినిమాపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం... 

1) 'ఎంట్రీ సీన్స్ చాలా బాగున్నాయి.. బీజీఎం గురించి చెప్పడానికి మాటల్లేవ్... అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంది.. ఎలివేటెట్ సీన్స్‌కి గూస్ బంప్స్ అంతే... అనేక ట్విస్టులు, మలుపులతో సినిమా ఆకట్టుకునేలా ఉంది... కేజీఎఫ్ 3 ఉండొచ్చుననే హింట్ ఇచ్చారు... మొత్తంగా బొమ్మ బ్లాక్ బస్టర్ 4.5/5' అంటూ ట్విట్టర్‌లో ఓ నెటిజన్ కేజీఎఫ్ 2పై తన రివ్యూ ఇచ్చారు.

2) 'ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది. నా రేటింగ్ 4.25/5. సినిమాకు యశ్ నటన, బీజీఎం, తల్లి సెంటిమెంట్, యశ్ వర్సెస్ అధీరా సీన్స్, క్లైమాక్స్ ప్లస్ అయ్యాయి.' అని మరో నెటిజన్ తన రివ్యూ ఇచ్చాడు.

3) 'ఇండియన్ సినిమాకు సంబంధించి ఇదొక అరుదైన ఘట్టం. స్టోరీ టెల్లింగ్‌లో కేజీఎఫ్ 1ని కేజీఎఫ్ 2 మించిపోయింది. ఎక్కడా ఎమోషనల్ కోర్‌ను కోల్పోకుండా యాక్షన్‌తో సినిమాను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. అందరి పెర్ఫామెన్స్ గొప్పగా ఉంది.' అని మరో నెటిజన్ కేజీఎఫ్ 2 గురించి చెప్పుకొచ్చాడు.

4) 'ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన టెర్రిఫిక్ మెంటల్ మాస్ సినిమా ఇది. యశ్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. అధీరాగా సంజయ్ దత్ పాత్ర ఎఫెక్టివ్‌గా ఉంది. రవీనా టాండన్ తన కెరీర్ బెస్ట్ రోల్‌ చేశారు. రవి బస్రూర్ బీజీఎం తుఫాన్ లాగే ఉంది. సినిమాకు రేటింగ్ 5/5' అంటూ మరో నెటిజన్ తన రివ్యూ ఇలా చెప్పుకొచ్చాడు. 

5) 'కేజీఎఫ్ 2... హైప్‌కి తగ్గట్లుగా లేదు. రెగ్యులర్ మాస్ మసాలాతో మూసగా ఉంది. సినిమా కథ, కథనాలను ముందే ఊహించేలా ఉన్నాయి. ఇంటెన్సిటీని మాత్రం బాగుంది. కేజీఎఫ్ 1 మ్యాజిక్‌ను రిక్రియేట్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విఫలమయ్యారు.' అంటూ మరో నెటిజన్ సినిమాపై పెదవి విరిచాడు. 

Also Read: Eluru Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు, ఐదుగురి సజీవ దహనం

 

Also read: APSRTC Charges Hike: ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. కనీస టికెట్ ధర రూ.15..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News