అమరావతి: ఏపీలో శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లాలో 26, విశాఖపట్నం జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 20 కేసులు గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 301 మంది కరోనావైరస్ నుంచి కోలుకున్నారు. ఇద్దరు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కరోనావైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 14,425 కి పెరిగింది. 


Also read : తెలంగాణలో 3,657 కరోనా యాక్టివ్ కేసులు


ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల 70 వేల 906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 20 లక్షల 54 వేల 056 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,425 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Also read : విజృంభిస్తున్న కరోనా కేసులు...ఆ దేశంలో మళ్లీ లాక్‌డౌన్...!


Also read : Vitamin E and Dry Fruits Benefits: విటమిన్ ఇ లేకపోతే ఆ రెండింటికీ ప్రమాదమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook