Who is Zainab Ravdjee: అఖిల్ కి కాబోయే భార్య జైనబ్ ఎవరో తెలుసా? ఆమెకు, ఉపాసనాకు సంబంధమేమిటంటే..!

Akhil Engagement: అక్కినేని కుటుంబంలో.. పండగ వాతావరణం నెలకొంది. నాగచైతన్య పెళ్లితో పాటు త్వరలోనే నాగార్జున అఖిల్ పెళ్లి కూడా చేయబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈరోజు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఈ హీరో. 

1 /6

అఖిల్ అక్కినేని కూడా తన అన్న నాగచైతన్య బాట..ఫాలో అవుతూ.. త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని నాగర్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “నా కుమారుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది,” అంటూ ఒక పోస్ట్ వేసుకు వచ్చారు నాగార్జున. 

2 /6

అఖిల్.. తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ..”నా కోడలు జైనబ్‌తో.. అఖిల్‌కి త్వరలోనే వివాహం జరగనుంది. జైనబ్‌తో.. మా ఫ్యామిలీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ జంటని.. మీరు ..అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకంటున్నా,” అంటూ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.   

3 /6

ఈ క్రమంలో అసలు ఈ జైనబ్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో.. తెగ వెటికేస్తున్నారు నెటిజెన్స్. అసలు విషయానికి వస్తే ఈమె స్కిన్ కేర్ అడ్వైజర్ అని తెలుస్తోంది. 

4 /6

జైనబ్ ఇంస్టాగ్రామ్ పేజ్ ప్రైవేట్ లో ఉండడం వల్ల.. ఈమె ఫోటోలు పెద్దగా బయటకి రాకపోయినా. అందులో బయో మాత్రం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. బయోలో జైనబ్ రావడ్జీ తాను వన్స్ అపాన్ ఎ స్కిన్.. బ్లాగ్ ఓనర్ గా రాసుకు వచ్చింది. ఇక ఆమె స్కిన్ కేర్ స్పెషలిస్ట్ గా అర్థమవుతోంది. 

5 /6

మరో విశేషం ఏమిటి అంటే ఈమెను ఎంతో మంది హీరోయిన్స్ ఫాలో అవ్వడం. అన్నిటికన్నా ముఖ్యంగా.. ఉపాసన కూడా ఏమని ఫాలో అవుతోంది. అఖిల్ మొదటి నిశ్చితార్థం చేసుకుంది ఉపాసన బంధువులు శ్రియా రెడ్డిని. అయితే ఆమెతో కొన్ని కారణాలవల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. 

6 /6

ఇక ఉపాసన ఇప్పుడు అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకునే రెండో అమ్మాయి అకౌంట్లో కూడా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ అమ్మాయి.. దుబాయిలో, లండన్ లో చదివిందని.. రెండు సంవత్సరాల ముందే అఖిల్ కి పరిచయమై ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x