అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంగ్ల మాద్యమం విషయంలో రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో ఉత్తర్వులను హైరోర్టు రద్దు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో నెం.8185ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దుచేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏ మాధ్యమంలో చదవాలన్నది విద్యార్థులకు వదిలేయాలని, ఆంక్షలు విధించేలా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు

మరోవైపు ఆంగ్ల మాధ్యమం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వ తరఫు లాయర్ వివరించారు. దీనిపై ఇంతకుముందే విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా ఆ జీవోను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo