AP High court: మాజీ మంత్రి నారాయణకు ఊరట..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..!
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
AP High court: ఏపీ రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్ రోడ్డు భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల అధికారులు విచారణ చేపట్టారు. మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు.
ఈక్రమంలో నారాయణతోపాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ హైకోర్టును వెళ్లారు. దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే 9కి వాయిదా వేసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో నారాయణతోపాటు ఇతరులకు ఊరట లభించింది.
ఇటీవల హైదరాబాద్‌లో టీడీపీ సీనియర్, మాజీ మంత్రి నారాయణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 10వ తరగతి పేపర్ లీక్ అంశంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ పోలీసులకు అధికారులు సమాచారం ఇచ్చారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య నారాయణను చిత్తూరుకు తీసుకెళ్లారు. అనంతరం ఈ కేసులో బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు. రాజధాని అమరావతి కేసులోనే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Also read:ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు!
Also read:Praposal Video: పెళ్లికి ముందు రోజు రాత్రి స్పెషల్ సర్ ప్రైజ్.. ఎవ్వరూ ఊహించలేరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి