IPL 2022 RCB v LSG Eliminator: KL Rahul become first player to score 600 plus runs in four IPL seasons: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం ఆఖరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్ 2కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రజత్ పాటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. అనంతరం 208 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లకు 193 స్కోరుకే పరిమితం అయింది. కేఎల్ రాహుల్ (79; 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్ హుడా (46; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 లకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 79 రన్స్ చేయడంతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్ 2022లో 15 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 661 పరుగులు చేశాడు. 2021 ఎడిషన్‌లో 626 పరుగులు, 2020 సీజన్‌లో 670 పరుగులు, 2018 ఎడిషన్‌లో 659 పరుగులు చేశాడు. ఈ రికార్డు దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు.
వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు సీజన్లలో 600 కంటే ఎక్కువ పరుగులు చేసి ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున గేల్ వరుసగా మూడు సంవత్సరాల్లో (2011, 2012, 2013) 600 లకు పైగా పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్నపుడు వార్నర్ 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడు సీజన్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వద్ద ఉంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 15 మ్యాచులు ఆడిన బట్లర్.. 718 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 2022 సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 51.33 సగటు, 135.38 స్ట్రైక్ రేట్‌తో 616 రన్స్ బాదాడు. ఇందులో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Also Read: GF Chapter 2 Collections: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దండయాత్ర.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎంతో తెలుసా?
Also Read: Virat Kohli on Rajat Patidar: నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదే.. యువ ఆటగాడిపై కోహ్లీ ప్రశంసలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి