AP DSC 2024: ఏపీ డీఎస్సీ నిలిపివేతకు హైకోర్టు నో, ఇప్పుడిక నిర్ణయం ఈసీ చేతిలోనే
AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 నిర్వహణపై మార్గం సుగమమైంది. నియామకాల ప్రక్రియను నిలిపివేయలేమని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక మిగిలింది ఎన్నికల కమీషన్ నుంచి క్లారిటీ రావడమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP DSC 2024: ఏపీ ప్రభుత్వం చేపట్టిన డిఎస్సీ 2024 రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలిచ్చింది. పరీక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం చేయలేమని, ప్రభుత్వ విధానపర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. డీఎస్సీ నిలుపుదల కోరుతూ దాఖలైన పిటీషన్లపై కోర్టు విచారణ జరిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకై ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది. టెట్ పరీక్షలతో షెడ్యూల్ కారణంగా హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్షలు ఇప్పటికే ఓసారి వాయిదా పడ్డాయి. ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాయిదా వేయాలని కొందరు అభ్యర్ధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురిని పిటీషన్లను పరిశీలించిన న్యాయస్థానం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. డీఎస్సీ నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.
ఉపాధ్యాయుల నియామకం అనేది పూర్తిగా ప్రభత్వ విధానపర నిర్ణయమని ఇందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు హడావిడిగా పిటీషన్ దాఖలు చేసి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వమని కోరితే ఎలా అని పిటీషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. డీఎస్సీ విషయంలో ఏ విధమైన మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. అసలు ఫిబ్రవరిలో డీఎస్సీ ప్రక్రియపై జీవోలు వెలువడితే ఇప్పుడు సవాలు చేయడమేంటని ప్రశ్నించింది. మద్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకు వచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగినవారికి ఉపాధ్యాయులుగా నియమించాలని , అన్ని స్కూళ్లను ఒకేలా పరిగణించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపి మే 1కు వాయిదా వేసింది. ఉపాద్యాయుల భర్తీ, అర్హతల వివరాలపై పూర్తి సమాచారంతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఏపీ హైకోర్టు.
ఏపీ డీఎస్సీ నిర్వహణపై హైకోర్టు నుంచి స్పష్టత రావడంతో ఇక మిగిలింది ఎన్నికల కమీషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే. డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరనుంది. డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా వేయాలని మరి కొందరు విజ్ఞప్తులు చేశారని ఏపీ ఎన్నికల కమీషనర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తరువాతే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుంది.
Also read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్.. టీజర్‌లో 'గాజు గ్లాస్' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook