Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యా శాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలను 1,37,587 మంది విద్యార్థులు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: జగన్‌ నా కష్టాన్నంతా బూడిదలో పోశారు.. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో కాదు


ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి ఏప్రిల్‌ 22వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రవేశ పరీక్షలకు సమయం ముంచుకొస్తుండడంతో ఈ మేరకు ఇంటర్‌ బోర్డు త్వరితగతిన పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలైన వారే కాక మార్కులు తక్కువ వచ్చిన వారు కూడా రాశారు. ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు రూ.లక్ష కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter