ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని షెల్టన్‌ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,16,993 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. 


ఇక ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాల విషయానికొస్తే, మంత్రి గంటా శ్రీనివాస రావు రేపు శుక్రవారం ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకుగాను 5,09,898 మంది విద్యార్థులు హాజరయ్యారు.