Adimulapu Suresh tested Covid-19 positive: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. నిత్యం సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ( Adimulapu Suresh ) కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకునగా.. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని పేర్కొంటున్నారు. అయితే ఆయన వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. Also read: Murder Movie: వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’‌కు బ్రేక్


ఇదిలాఉంటే.. మంత్రి కరోనా బారిన పడటంతో ఆయనకు సన్నిహితంగా ఉన్న అధికారులు, నాయకులకు కరోనాటెస్టులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక మంది అధికారపార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవలనే ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు.  Also read: Rahul Gandhi Comments: నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆజాద్